రుజువులతో రక్షకుడు వచ్చే Lyrics - Bethesda Bethel Ministries
రుజువులతో రక్షకుడు వచ్చే Lyrics - Bethesda Bethel Ministries
పల్లవి: రివ్వు రివ్వు రివ్వు మంటూ రుజువులతో....
రయ్ రయ్ రయ్ మంటూ.... రక్షకుడు వచ్చే
రివ్వు రివ్వు రివ్వు మంటూ రుజువులతో ....
రయ్ రయ్ రయ్ మంటూ ....రక్షకుడు రాగ
భూ రాజులకు భయం పుట్టెను
భూ జనులకు అభయం తట్టెను (2 )
పసిడి రూపమే - చిరు దీపమై
ప్రపంచ మోక్ష జన్మమే ప్రభంజనమై
అ.ప. ఊరు వాడ - పిల్లా జల్లా ఉల్లసించెను
బడి గుడి - పెద్ద చిన్న పరవశించెను (2 )
కేరల్స్ స్వరాలతో - క్యాండిల్స్ వెలుగులతో
తీయ తీయని కేకులతో మనసంతా పులకరించెను
1 . చలనం చైతన్యం శ్రీ యేసుని జన్మతో ....
సైన్యంలా నే సాగుతూ - అంగరంగ వైభవంగా ఊగుతూ (2 )
కనులు మిరిమిట్లు గొలిపె
రంగు రంగుల విద్యుత్ కాంతులతో
రెట్టింపు ఉల్లాసం రాబట్టే సమయం (2 )
2 . పుణ్యం నైపుణ్యం మరియ యేసుప్రభువులో
ప్రధమ పురుషుడులో పరిశుద్ధత లేదుగా (2 )
మేధావులకే అర్ధంకాని నిత్య నివాసి ఆగమనము
మందకాపరులకు బోధపడింది - సత్యస్వరూపి ఆగమనము
లోక రక్షకుడని యేసుని నమ్ముకుంటే - రక్షణ సంతోషం
లోక రక్షకుడని యేసుని నమ్ముకుంటే - హృదయమే ఆనందం
Lyrics:- B.John Sandeep
రుజువులతో రక్షకుడు వచ్చే Lyrics - Bethesda Bethel Ministries

Social Plugin